ఒక పెద్ద సినిమా మొదలవుతుందంటే చాలు.. సదరు సినిమా గురించి బోలెడన్ని వార్తలు, గుసగుసలు రావడం ఖాయం. అలాంటిది మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ వంటి హీరోలిద్దరితోనూ “బాహుబలి” అనంతరం రాజమౌళి తీయనున్న సినిమా అంటే అంచనాలు ఇంక ఎంత పెద్ద స్థాయిలో ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాలా. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇటీవల ఘనంగా ప్రారంభమైన ఈ రాజమౌళి 11వ చిత్రానికి “ఆర్ ఆర్ ఆర్” అనే వర్కింగ్ టైటిల్ పెట్టడంతో అందరూ “ఆర్ ఆర్ ఆర్” అంటే రకరకాల డెఫినిషన్స్ ఇవ్వడం మొదలెట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ చిత్రం టైటిల్ “రామ రావణ రాజ్యం” అనే టాక్ కాస్త గట్టిగా స్ప్రెడ్ అవుతూ ఉంది.
అయితే.. సినిమా యూనిట్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఈ విషయమై స్పందిస్తూ. ఉంటే రామ రాజ్యం అయినా ఉంటుంది లేదా రావణ రాజ్యం అయినా ఉంటుంది కానీ.. “రామరావణ రాజ్యం” ఎక్కడైనా ఉంటుందా? అని గట్టిగా కడిగేశాడు. దాంతో సినిమా టైటిల్ “రామరావణ రాజ్యం” కాదని కన్ఫర్మ్ అయిపోయింది. మరి టైటిల్ ఏమిటనేది రాజమౌళి చెప్పేవారకు ఎవరికీ తెలియదేమో.