రాజమౌళికి సల్మాన్ రికమెండేషన్.. ?

  • April 24, 2019 / 02:27 PM IST

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అజయ్ దేవగన్, సముద్రఖని కూడా కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ నటి డైసీ నటించాల్సి ఉంది . అయితే కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ సరసన నటించాల్సిన డైసీ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంది. దీంతో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం వెతుకుంది చిత్రబృందం. ఇప్పటికే శ్రద్దా కపూర్, పరిణితీ చోప్రాల పేర్లు వినిపించినా.. ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా మరో భామ పేరు వినిపిస్తుంది.

అందుతున్న సమాచారం ప్రకారం జాక్వెలిన్ ఫెర్నండజ్‌ ను ఎన్టీఆర్ కు హీరోయిన్ గా ఎంచుకున్నారట. జాక్వెలిన్ ఫెర్నండజ్‌ ను సల్మాన్‌ ఖాన్, రాజమౌళికి రికమెండ్‌ చేశాడని.. బాలీవుడ్‌ నుండీ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంతుందో తెలీదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది.400 కోట్ల భారీ బడ్జెట్ తో డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నాడు. 2020 జూలై 30 న ఈ చిత్రం విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus