“ఆర్ ఎక్స్ 100” సినిమా చూశాక యూత్ అందరూ అప్పటివరకూ తమని ప్రేమించిన అమ్మాయిలను ఆ సినిమాలోని హీరోయిన్ రోల్ లో చూసుకొని సంతృప్తిపడగా.. ఇంకొందరేమో లవ్ లో ఉన్న తమ ప్రేయసిలను అనుమానపడడం మొదలెట్టారు. అంత భారీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన “ఆర్ ఎక్స్ 100” దర్శకుడు అజయ్ భూపతి తాను మాత్రం సైలెంట్ గా లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. తన కు బాగా పరిచయమున్న శిరీష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఈనెల 25న.
బిటెక్ పూర్తిచేసిన శిరీష తో ప్రేమాయణం సాగిస్తున్నాడు ఈ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు . ఆత్రేయపురం లో పెళ్లయ్యాక మళ్ళీ ఇక్కడ సినీ ప్రముఖులకు ఆతిధ్యం ఇవ్వనున్నాడు . ఆర్ ఎక్స్ 100 తో డైరెక్టర్ గా సంచలనం సృష్టించిన అజయ్ కి వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి . అయితే ముందు పెళ్లి తర్వాత సినిమాలు అనే ఆలోచనలో ఉన్నాడు ఈ దర్శకుడు.