అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న ఆర్ఎక్స్100!

  • July 20, 2018 / 07:40 AM IST

నూతన నటుడు కార్తికేయ హీరోగా యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్100  మూవీ సంచలన విజయం సాధించింది. కొత్త కథ, కథనం,  హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అందాలు సినిమాకి రిపీట్ ఆడియన్స్ వచ్చేలా చేస్తోంది. రెండున్నర కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా రెండు రోజుల్లోనే 2.53 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. మౌత్ టాక్ కారణంగా థియేటర్లన్నీ హౌస్ ఫుల్ కలక్షన్స్ తో సాగుతున్నాయి. తొలివారంలో 7,53,98,709 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సింగిల్ థియేటర్లో అత్యధిక కలక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో ఐదవ స్థానాల్లో నిలిచింది.

హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో మొదటి వారానికి 29 లక్షల షేర్ వసూలు చేసి ఈ రికార్డును నెలకొల్పింది. ఇప్పటివరకు  సుదర్శన్ థియేటర్లో  బాహుబలి కంక్లూజన్ ఫస్ట్ వీక్ 36 లక్షలు వసూలు చేసి మొదటి స్థానాల్లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రంగస్థలం (31 లక్షలు), ఎంసీఏ (30 లక్షలు), బాహుబలి బిగినింగ్ (30 లక్షలు)  నిలిచాయి. చిన్న చిత్రంగా వచ్చిన ఆర్ఎక్స్100  పెద్ద విజయం సాధించడమే కాకుండా స్టార్ హీరోల చిత్రాల సరసన నిలవడం అద్భుతమని చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus