సస్పెన్స్ క్రియేట్ చేసిన “సాహసం శ్వాసగా సాగిపో” ట్రైలర్

  • June 1, 2016 / 01:20 PM IST

గౌతం మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన రెండో సినిమా “సాహసం శ్వాసగా సాగిపో”. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా “ఏ మాయ చేసావే” క్యూట్ లవ్ స్టోరీగా హిట్ అందుకుంది. అందుకే “సాహసం శ్వాసగా సాగిపో” మూవీ పైన అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని ఈ సినిమా తొలి టీజర్ పెంచింది.
లేటెస్ట్ గా జూన్ 1న విడుదలైన ట్రైలర్ సస్పెన్స్ క్రియేట్ చేసింది. “లైఫ్ లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. అది జరిగినప్పుడు మనం దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా ? లేదా? అన్నదే ముఖ్యం.” అనే డైలాగ్ తో ముగిసే 1.27 నిముషాల ట్రైలర్ నాగ చైతన్య అభిమానుల్లో క్యూరియాసిటీని కలిగించింది.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus