ఒకే రోజుపైన కన్నేసిన సైరా, సాహో సినిమాలు?

  • November 30, 2018 / 11:28 AM IST

తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు ‘సైరా’, ‘సాహో’. ‘సైరా’ సినిమా విషయానికి వస్తే, హీరో రామ్ చరణ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, బ్రిటిష్ వారి పై తిరుగుబాటు చేసిన స్వాత్యంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఇక యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమా తరువాత చేస్తున్న సినిమా కావడం, పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా చాలా రిచ్ గా చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

అయితే ఈ రెండు సినిమాల విషయంలో రిలీజ్ డేట్స్ విషయంలో కాస్త కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది. ‘సాహో’ నిర్మాతలు వచ్చే ఏడాది ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ‘సైరా’ సినిమా వచ్చే ఏడాది మే లేదా జూన్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకున్నారు. అయితే సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్ వర్క్స్ కనుక ఒకవేళ ఆలస్యం అయితే సైరా సినిమా కి ఉన్న బెస్ట్ ఆప్షన్ కూడా ఆగస్టు 15. స్వాత్యంత్ర సమరయోధుడి కథ కనుక ఆ రోజు సరైందని సైరా టీం కూడా భావిస్తుందట. ఇలా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేనందున ప్రభాస్ ‘సాహో’ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి లేదంటే దసరా కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి రెండు భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో రిలీజ్ విషయంలో కాస్త గ్యాప్ ఎక్కువగా ఉంటేనే రెండు సినిమాలకి మంచిదని అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus