బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీస్ లో ఎవిలిన్ శర్మ ఒకరు. హీరోయిన్ గా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ.. వీడియో సాంగ్స్ & స్పెషల్ రోల్స్ ద్వారానే భీభత్సమైన స్టార్ డమ్ సంపాదించుకొంది. చిన్నపాటి సన్నివేశాల్లోనూ శ్రుతిమించిన అందాలను ఆరబోసే ఎవిలిన్ కు కుర్రకారులో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇటీవలే “సాహో” సినిమాలోనూ అతిధి పాత్రలో మెరిసిన ఈ అందాల భామకు పెళ్లి నిశ్చయమైంది.
ముంబైకు చెందిన బిజినెస్ మ్యాన్ తుషాన్ తో గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న ఎవిలిన్ కు ఇరు కుటుంబాల పెద్దల నుండి అంగీకారం లభించడంతో.. నిన్న తమ పెల్లిని అధికారికంగా ప్రకటించారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక బ్లైండ్ డేట్ లో కలుసుకొన్న ఈ ఇద్దరు ఇష్టాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. వీళ్ళ పెళ్లి ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటించనున్నారు. మరి ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు దూరమవుతుందా లేక ఎప్పట్లానే తెరపై తన అందాలతో ప్రేక్షకులని ఆకట్టుకొంటుందో చూడాలి.
ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!