ఇక్కడ ప్లాపైనా.. అక్కడ హిట్టైంది.. ఇదే నిదర్శనం..!

Advertisement

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 30 న విడుదలై ప్లాప్ టాక్ కూడా కాదు.. ఏకంగా డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. తెలుగులో మాత్రమే కాదు.. హిందీలో కూడా డిజాస్టర్ టాకే వచ్చింది. ఇక క్రిటిక్స్ అయితే ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు ఇచ్చి… ఏకిపారేశారు. అయినా సరే ‘బాహుబలి’ అలాగే ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కారణంగా భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఎలాగూ వీకెండ్, వినక చవితి సెలవు ఉంది కాబట్టి.. మంచి కలెక్షన్లు వచ్చాయి అని అంతా అనుకున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో అలాగే జరిగినప్పటికీ.. హిందీలో మాత్రం అలా జరగలేదు. వీక్ డేస్ లో కూడా అక్కడ మంచి కలెక్షన్లు రాబట్టింది ‘సాహో’ చిత్రం. అయిప్పటికీ అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం లేదని చాలా మంది కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కు చెక్ పెడుతూ.. ఈ చిత్రం తాజాగా 150 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఇప్పటివరకూ అక్కడ మొత్తం కలిపి 153 కోట్ల నెట్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. దీంతో హిందీలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి.. హిట్ స్టేటస్ ను సాధించింది. మొత్తానికి హిందీలో అయితే ‘సాహో’ హిట్టయ్యింది.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news