ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సాహో’ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ఎంత పెద్ద ప్లాప్ సినిమాకి అయినా ఈ రోజుల్లో 50 శాతం రికవరీ అవ్వడం చాలా కష్టమైపోయింది. అలాంటిది ‘సాహో’ చిత్రానికి 65 శాతం రికవరీ జరిగిపోయింది. మరీ తీసి పారేసేంత రేంజ్లో అయితే ‘సాహో’ సినిమా కాదు. ఎందుకంటే హిందీలో ఈ చిత్రం హిట్టయ్యింది. అక్కడ 100 కోట్లకు పైనే వసూళ్ళను రాబట్టి అక్కడ హిట్టనిపించుకుంది. ఇదిలా ఉంటే… ‘ ‘సాహో’ కు ఆడియన్స్ రెస్పాన్స్ బాగానే ఉన్నా కొందరు కావాలని నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని.. అసలు ఇలాంటి మాస్ ఎంటర్టైనర్ ను ప్రభాస్ కు ఇచ్చినందుకు బీహార్ లో అయితే నాకు గుడి కట్టించేందుకు రెడీగా ఉన్నారని’ డైరెక్టర్ సుజీత్ అన్నట్టు కొన్ని కథనాలు పుట్టుకొచ్చాయి.
తాజా వీటి పై స్పందించాడట సుజీత్. ఓ బాలీవుడ్ మ్యాగజైన్ కు సుజీత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని పేర్కొన్నాడట. సుజీత్ స్పందిస్తూ… “నేను అలాంటి కామెంట్స్ చేయలేదు.. ఎప్పుడూ చెయ్యను కూడా..! ఇలాంటి కామెంట్స్ ఎంత సిల్లీగా ఉంటాయో నాకూ తెలుసు. నేను ప్రభాస్ సర్, నిర్మాతలు ఎంతో నమ్మి ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చి ‘సాహో’ చూశారు. అయినా నేనేదో పెద్ద నేరం చేసినట్టు నన్ను విమర్శిస్తున్నారు” అంటూ పేర్కొన్నాడట. అయితే ఇవైనా నిజాలేనా అనే డౌట్.. అందరిలోనూ ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు సుజీత్ ఓ సారి ప్రెస్ మీట్ పెట్టేసి వీటన్నికీ క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని అంతా అనుకుంటున్నారు. చూద్దాం.. మరి ఏం చేస్తాడో..!