పంద్రాగస్టున ప్రభాస్ ఫస్ట్ లుక్

  • August 5, 2017 / 07:16 AM IST

“బాహుబలి” మొదలై నాలుగేళ్లవుతోంది, “బాహుబలి 2” విడుదలై 100 రోజులవుతోంది. అప్పట్నుంచి ఇప్పటివరకూ ప్రభాస్ అభిమానులందరూ ఎంతో ఆనందంగా “బాహుబలి.. బాహుబలి” అంటూ తమ హీరో సినిమా గురించి గొప్పగా చెప్పుకొంటూ, కుదిరిన చోట కుదిరినంతలో ప్రచారం చేసుకుంటూ వచ్చినా.. మా హీరోని మాంచి స్టైలిష్ అవతార్ లో చూసి ఎన్ని రోజులైందో అనే బెంగ పెట్టుకొన్నారు. “సాహో” టీజర్ తో ఆ బెంగ కాస్త తీరింది. మొన్నామధ్య ప్రభాస్ చేయించుకొన్న స్పెషల్ ఫోటో షూట్ తో ఇంకాస్త సేదతీరిన అభిమానులు, “సాహో” పట్ల మాత్రం కాస్త అసహనంతో ఉన్నారు.

రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవ్వకపోయినా.. లాంఛనంగా ప్రారంభమై మూడు నెలలు పూర్తికావస్తున్నా.. ఇప్పటివరకూ విలన్లు తప్ప హీరోయిన్ సైతం ఫిక్స్ చేయకపోవడం.. ఇప్పటివరకూ సెట్స్ కు వెళ్లకపోవడంతో డైరెక్టర్ సుజీత్ పై దాదాపు నిప్పులు చెరుగుతున్నారు ప్రభాస్ వీరాభిమానులు. ఆ అభిమానుల కోపాన్ని కాస్త తగ్గించేందుకు సన్నద్ధమవుతున్నారు “సాహో” బృందం. ఆగస్ట్ 15న సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ వార్తకి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు కానీ.. ఒకవేళ ఈ విషయం నిజమైతే ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులుండవు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus