‘సాహో’ భామకి పెళ్ళి ఫిక్సయిందట..!

  • March 20, 2019 / 12:29 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గతంలో ఫర్హాన్ అక్తర్ తో ప్రేమాయణం నడిపిన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని ఓ రేంజ్లో టాక్ నడిచింది. అయితే కొన్ని కారణాల వలన ఈ జంట విడిపోయింది. ఈ విషయం పై అప్పట్లో చాలా రచ్చ జరిగింది. ఇక తరువాత సినిమాలతో బిజీ అయిపొయింది శ్రద్ధా కపూర్. ఇప్పుడు మరోసారి ఆమె పెళ్ళి వార్త మీడియాలో హల్ చల్ చేస్తుంది.

వివరాల్లోకి వెళితే 2020లోనే శ్రద్ధా వివాహం జరుగబోతుందని బాలీవుడ్ మీడియా వర్గాల కోడై కూస్తున్నాయి. గత కొంతకాలంగా శ్రద్దా.. రోహన్ శ్రేష్ట అనే ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో ఉందట. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారట. దీంతో ఇప్పుడు అతడిని పెళ్ళి చేసుకొని సెటిల్ అవ్వాలని శ్రద్దా భావిస్తోందట. ప్రస్తుతం శ్రద్ధ వయసు 32 కావడంతో… ఆమె ఇంట్లో వారు కూడా ఆమెను పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో తన ఇంట్లో వారికి రోహన్ గురించి చెప్పి పెళ్ళికి ఒప్పించిందట. ఇక 2020లోనే ఈ జంట వివాహం చేసుకోబోతుందని తెలుస్తుంది. ఇక శ్రద్దా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం 2019 లోనే ఆగష్టు 15 న కాబోతుంది. దీంతోపాటూ బాలీవుడ్ లో ‘చిచ్చోరే’, ‘ఏబీసీడీ 3’ చిత్రాల్లో కూడా నటిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus