‘సాహో’ లేటెస్ట్ అప్డేట్..!

  • May 16, 2019 / 01:48 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ తాజా చిత్రమైన ‘సాహో’ కోసం అయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ కు తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఆయనకి భారీగా క్రేజ్ ఏర్పడింది. దీంతో ‘సాహో’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రభాస్ సన్నిహితులైన వంశీ, ప్రమోద్ లు ‘యూవి క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ప్రభాస్ మే నెల చివరి వారం నుండీ తన పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ కు కూడా ప్రభాస్ ఓన్ డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడట. ఇక ఈ చిత్రంలో విజువల్స్, యాక్షన్ సీన్స్.. హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయట. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. లొకేషన్స్ కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని సమాచారం. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 15 విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus