ప్రభాస్ సినిమాకి స్వాతంత్రం వచ్చేది అప్పుడే..

  • November 21, 2018 / 12:32 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈయన ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం తెలిసిన స్టార్ హీరో. బాహుబలి సినిమాతో ప్రపంచం మొత్తం ప్రభాస్ ఇప్పుడు టాప్ లెవెల్ లో వున్నాడు. “బాహుబలి 2” విడుదలై అప్పుడే ఏడాదిన్నర పూర్తవుతున్నప్పటికీ.. ఇప్పటివరకూ సాహో విడుదల తేదీ మాత్రం ప్రకటించలేదు. దాంతో ఇటీవల విడుదలైన “సాహో” మేకింగ్ టీజర్ కాస్త సంతృప్తపరిచినా.. విడుదల తేదీ ఎప్పుడనేది ఇప్పటివరకూ ప్రకటించకపోవడం ప్రభాస్ అభిమానుల్ని కలవరపరిచింది.

అయితే.. ప్రభాస్ ఒక స్పైగా నటిస్తున్న ఈ చిత్రం “మిషన్ ఇంపాజబుల్” తరహాలో ఉండబోతుండడంతో సినిమాని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తే మంచిదని భావిస్తున్నారట. అందుకే ఆగస్ట్ 13, 2019న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. సౌత్ ఇండియాస్ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీగా ఆల్రెడీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న “సాహో” తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus