ప్రభాస్ నిర్మాతలు బంపర్ ఆఫర్ కొట్టేసారుగా.. !

  • July 10, 2019 / 05:03 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ డిస్ట్రిబ్యూషన్ వైపు కూడా మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చరణ్,బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామా’ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. చరణ్ కు వారికి మధ్యన మంచి అనుబంధం ఉండడంతో.. ఈ అవకాశం వారికి దక్కింది. తమ బ్యానర్ లో చిన్న హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా… ‘గీత ఆర్ట్స్2’ బ్యానర్ తో కలిసి మీడియం రేంజ్ సినిమాలు కూడా చేస్తుంటారు. ఇదిలా ఉంటే…. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రాన్నే డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారట.

అందుతున్న సమాచారం ప్రకారం… మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులను ‘యూవీ క్రియేషన్స్’ దక్కించుకుందట. అందులోనూ మెగాస్టార్ కు పిచ్చ క్రేజ్ ఉన్న ఆంధ్రా ఏరియా కావడం విశేషం. భారీ మొత్తం చెల్లించి ఈ హక్కుల్ని వారు దక్కించుకున్నారట. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తుంది. ఇక ‘సైరా’ చిత్రం అక్టోబర్ 2 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus