మారిన సాహో షూటింగ్ డేట్

  • December 22, 2017 / 06:40 AM IST

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా స్టార్స్ తో నిండిపోయింది. ఇందులో సౌత్, నార్త్ సినీ పరిశ్రమల్లోని నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్, విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు నటిస్తున్నారు. అంతేకాదు తమిళనటుడు అరుణ్ విజయ్, మల్లూవుడ్ సీనియర్ నటుడు”లాల్” కూడా సాహోలో కనిపించబోతున్నారు. ఈ సినిమాని మూడో షెడ్యూల్ అబుదాబిలో జరగాల్సింది. కానీ అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో ఆ షెడ్యూల్ ని హైదరాబాద్ కి మార్చారు. కొన్ని రోజులు ఇక్కడ షూటింగ్ అనంతరం దుబాయ్ శివార్లలోని కొండల మధ్య భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు.

అయితే హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ అనుకున్న రోజుల కంటే ఎక్కువ రోజులు షూటింగ్ జరిగేలా ఉందని తెలిసింది. దీంతో దుబాయ్ కి వెళ్లే డేట్ ని మార్చుకున్నట్టు సమాచారం. అక్కడ కొంచెం లేట్ గా షెడ్యూల్ మొదలైనప్పటికీ నెలరోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ జరుగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ యాక్షన్ సీన్ 20 నిముషాల పాటు ఉంటుందని వెల్లడించింది. ఈ సన్నివేశాన్ని హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో షూట్ చేయనున్నారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus