ప్రఖ్యాత ప్రదేశాల్లో సాహో షూటింగ్

  • June 23, 2017 / 06:11 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ చిత్రం తర్వాత చేయనున్న చిత్రం గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటికి వస్తోంది. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ మూవీకి బాలీవుడ్, హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషయన్లు పనిచేయనున్నారు. ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రానికి  సినిమాటోగ్రాఫర్ గా మధిని తీసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ముంబై, అబుదాబి, రొమేనియా వంటి ప్రఖ్యాత ప్రదేశాల్లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మూడు లొకేషన్స్ లోను భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు.

ఈ ఫైట్స్ ని మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఇందులో విలన్ గా నటిస్తున్న హిందీ నటుడు నీల్ నితిన్ ముఖేష్ పై హైదరాబాద్ లో కొన్ని సీన్స్ తీస్తున్నారు. త్వరలోనే చిత్ర బృందం ముంబై కి వెళ్లనుంది. అక్కడ షెడ్యూల్ లో ప్రభాస్ జాయిన్ అవుతారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సాహోకి సంగీతాన్ని అందించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus