బాహుబలి కంక్లూజన్ రిలీజ్ రోజే రానున్న సాహో

  • July 28, 2018 / 10:31 AM IST

యువ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో చిత్రం రీసెంట్ గా అబుదాబిలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ షెడ్యూల్ కి దాదాపు 70 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ షూటింగ్ లో ప్రభాస్, శ్రద్ధా కపూర్‌, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిర బేడీ తో ఎవ్లిన్‌ శర్మ కూడా పాల్గొన్నారు. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో సాగుతోంది. టి సిరీస్ తో కలిసి యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమాకి జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అలాగే ఈ సినిమాని బాహుబలి కంక్లూజన్ మూవీ రిలీజైన ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. గతేడాది రిలీజ్ అయిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. అదే సెంటిమెంట్ తో వచ్చే ఏదాది అదే తేదీన అంటే 2019 ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలనీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అంతా అనుకున్నట్టు జరిగితే సాహో అప్పుడే థియేటర్లోకి రావడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus