ప్రభాస్ ఫ్యాన్స్ ను సంతోష పరచడం కోసం సాహో టీం సిద్ధం!

  • April 1, 2018 / 01:14 PM IST

“బాహుబలి 2” విడుదలై ఈ ఏప్రిల్ 28కి ఏడాది పూర్తవుతుంది. అంటే ప్రభాస్ ను ఆయన అభిమానులు వెండితెర మీద చూసుకొని ఏడాడవుతున్నదన్నమాట. ఏదో మధ్యలో సాహో స్పెషల్ ఫోటోషూట్స్ పుణ్యమా అని ప్రభాస్ కొత్త ఫోటోలు బయటకొచ్చాయి కానీ.. లేదంటే అభిమానులకు ఆ అదృష్టం కూడా ఉండేది కాదు. ఈ విషయమై అభిమానులందరూ గుర్రుగా ఉన్న విషయాన్ని గుర్తించిన యువి క్రియేషన్స్ సంస్థ అర్జెంట్ గా “సాహో” సినిమా సంబంధించిన ఒక ప్రోమోను “బాహుబలి 2” విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. “సాహో” టీజర్ విడుదలై కూడా అప్పటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది.

ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం చిత్ర బృందం దుబాయ్ లో “సాహో” షూటింగ్ కోసం రెక్కీ నిర్వహిస్తోంది. రెక్కీ అనంతరం అక్కడ భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ లతోపాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరి అభిమానుల కోసం ఏప్రిల్ 28న విడుదల చేయనున్న “సాహో” ప్రోమోలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus