యాక్షన్ సన్నివేశాలకు రెడీ అవుతున్న సాహో టీమ్!

  • October 26, 2017 / 10:47 AM IST

సాహో ఫస్ట్ లుక్ ప్రభాస్ పుట్టినరోజున రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచేసింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో జరిగింది. అలాగే అమీర్ పెట్ లో వేసిన ఇంటి సెట్ లో ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ పై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు. కొంత గ్యాప్ ఇచ్చారు. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో మొదలుకాబోతోంది. దుబాయ్ లోని ఎత్తైన భవనాలపై నుంచి ఆకాశంలో ఫైట్ ని షూట్ చేయనున్నారు. ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్ లపై తెరకెక్కించే ఈ యాక్షన్ సన్నివేశాన్ని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నేతృత్వంలో జరగనుంది.

ఇప్పటికే ప్రభాస్ టీమ్ శిక్షణ పూర్తిచేసింది. ప్రస్తుతం రిహార్సల్స్ చేస్తున్నట్లు తెలిసింది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి  సంగీత  దర్శకత్రయం శంకర్, ఇహసాన్, లాయ్ లు సంగీతం అందిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మితమవుతున్న సాహోపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus