జనతా గ్యారేజ్ లో ‘సచిన్’ కీలక పాత్ర..

  • May 25, 2016 / 07:02 AM IST

13బి, బ్రదర్స్ చిత్రాల్లో నటించిన మరాఠీ నటుడు సచిన్ ఖేద్కర్.. ‘జనతా గ్యారేజ్’ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. సచిన్ ను కలిసిన చిత్ర దర్శకుడు కొరటాల శివ.. చిత్రంలోని ఆయన పాత్ర గురించి చెప్పగానే ఈ చిత్రంలో నటించడానికి ఆయన అంగీకరించాడని అంటున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఎన్‌టి‌ఆర్ సరసన నిత్యామీనన్, సమంత లు జంటగా నటిస్తుండగా.. మలయాళీ స్టార్ మోహన్ లాల్, ఉన్ని ముకుందన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus