బాలయ్య, ప్రభాస్ ల గురించి గొప్పగా చెప్పిన మెగా హీరో

  • February 9, 2018 / 10:22 AM IST

మెగా హీరో అనగానే తన ఫ్యామిలీ హీరోల గురించి గొప్పగా చెప్పడం కామన్. ఇతర హీరోల గురించి మాట్లాడడం అరుదు. అయితే సాయి ధరమ్ తేజ్ నందమూరి హీరో గురించి గొప్పగా చెప్పారు. అలాగే ప్రభాస్ నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నట్లు వివరించారు. పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి విజయాలతో దూసుకు పోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి వరుసగా తిక్క, విన్నర్, నక్షత్రం రూపంలో అపజయాలు పలకరించాయి. బీవీఎస్ రవి దర్శకత్వంలో నటించిన జవాన్ కూడా ఫ్లాప్ అయింది. అందుకే మాస్ డైరక్టర్ వివి వినాయక్ తో కలిసి ఇంటెలిజంట్ గా వచ్చారు.

మాస్ కి ఇష్టమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ ఓ ఇంట‌ర్వ్యూలో బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “ఇంటెలిజంట్ సినిమా ప్ర‌చార చిత్రాల‌ను విడుద‌ల చేయ‌డానికి బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ వ‌చ్చి న‌న్ను ఆశీర్వ‌దించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం వారిది. వారి ప్రేమ‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. మా తరానికి బాల‌య్య‌, ప్ర‌భాస్ ఎన్నో విష‌యాలు నేర్పించారు. తోటి క‌ళ‌కారుల‌ను ప్రోత్స‌హిండం గురించి వారి వ‌ద్ద నేర్చుకోవాల‌ని” అని సాయిధ‌ర‌మ్ తేజ్ ప్రసంశలు గుప్పించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus