లవ్ “అఫేర్”పై స్పదించిన మెగా హీరో…

టాలీవుడ్ లో టాఫ్ ఫ్యామిలీస్ లో ఒకటైన మెగా ఫ్యామిలీలో అనేకమంది హీరోలు ఉన్నారు…అయితే అందరూ దాదాపుగా సక్సెస్ఫుల్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఎవరికి వారు ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగా హీరో సాయి ధర్మ తేజ వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలి అంటే మెగా హీరో నుంచి…”సుప్రీం” హీరో అంటూ పిలిపించుకునే స్థాయికి వచ్చేశాడు.

అంతేకాకుండా కనీసం 20 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా చెలరేగి పోతున్నాడు. ఇదే క్రమంలో వరుస హాట్స్ తో పాటు, ఈ కుర్ర హీరోపై ఆఫైర్స్ రూమర్స్ కూడా బాగా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా అందాల భామ రేజీనా తో సినిమాలు చేయడం ఇద్దరూ కలిసి పార్టీలకు అటెండ్ అవుతూ ఉండడం ఏవైనా ఫంక్షన్లలో కలిసి కనిపించడం పలుమార్లు మీడియా కంటికి చిక్కడం.. ఇలాంటివన్నీ కలిపి అందరూ వీళ్ళ మధ్య ఏదో ఉంది అని డిసైడ్ అయిపోయారు…ఇక వీటిపై తేజా మాట్లాడుతూ…’ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లను ఏమని అనాలో తెలీడం లేదు. ఇలాంటి వాటికి నేను అసలు స్పందించను పట్టించుకోను కానీ రెజీనాపై ఇలాంటి రావడంతో ఫీల్ కావాల్సి వస్తోంది.

ఇలాంటి రూమర్లతో ఇబ్బందులు పడుతున్న మరికొందరు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నారు. ప్రజలు వీరిపై గౌరవం ఉంచాల్సిన అవసరం ఉంది’ అంటున్నాడు ఏ కుర్ర హీరో…అంతా బాగానే ఉంది కానీ, ఇంతమంది అమ్మాయిల పై లేని ఇంట్రెస్ట్ రేజీనా విషయంలోనే ఎందుకో కాస్త క్లారిఫికేషన్ ఇస్తే బెట్టర్ అని అనిపిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus