నేను అలా చేయను – అనుపమ పరమేశ్వరన్

Advertisement

మలయాళ భామ అయినప్పటికీ అనుపమా పరమేశ్వరన్ అతి తక్కువ కాలంలోనే తెలుగు అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. తొలి చిత్రం అ..ఆ సినిమాలోనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని తెలుగంటే ఇష్టమని చెప్పకనే చెప్పింది. పది సినిమాలు చేసినా తెలుగులో మాట్లాడలేకపోతున్న వారిని సైతం గుండెల్లో పెట్టుకున్న తెలుగువారు.. అనుపమని తమ ఇంటి పిల్లగా చేసుకున్నారు. చూసుకుంటున్నారు. అందుకే ఆమె నటించిన ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నదీ ఒక్కటే జిందగీ లను హిట్ చేశారు. ప్రస్తుతం ఆమె నటించిన మూవీ “తేజ్‌ ఐ లవ్‌ యూ” వచ్చే నెల 6 న రిలీజ్ కాబోతోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలోని “నచ్చుతున్నాడే” అనే సాంగ్ ప్రోమో నేడు రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది.

ఈ వీడియో సాంగ్ గురించి చెబుతూ అనుపమ, తేజు చేసిన ట్వీట్స్ మరింత ఆకట్టుకుంటోంది. ” మన సినిమాల్లో అమ్మాయిని హీరో (నాతో సహా) ఏడిపించే పాటలు ఇప్పటికే చాలా వచ్చాయి. అందుకు భిన్నంగా హీరోయిన్ అనుపమ హీరోని (నన్ను) టీజ్ చేస్తే. “నచ్చుతున్నాడే” టీజర్ వస్తుందంటూ తేజూ తన ట్వీట్‌లో తెలిపాడు. తేజూ ట్వీట్‌కు అనుపమ “నేను అలా చేయను.. ఐ యామ్ ఎ గుడ్ గర్ల్” అంటూ క్యూట్ గా ట్వీట్ చేసింది. అందుకు తేజూ స్పందిస్తూ.. “కరెక్ట్ మీరు టీజ్ చేయలేదు. టార్చర్ చేశారు” అంటూ కామెంట్ చేశారు. ప్రోమో చూసిన తర్వాత మాత్రం తేజు చెప్పిన మాటే నిజమనిపిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus