ఇదే ఊపు కొనసాగితే రూలర్ ని బీట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు!

  • December 16, 2019 / 09:15 AM IST

ఈ శుక్రవారం విడుదలవుతున్న రెండు సినిమాలు “రూలర్ & ప్రతిరోజూ పండగే”. “జై సింహా” లాంటి 50 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బాలయ్య-కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రూలర్”తోపాటు మారుతి దర్శకత్వంలో తొలిసారిగా సాయిధరమ్ తేజ్ నటించిన “ప్రతిరోజూ పండగే” కూడా ఆదేరోజు విడుదలవుతోంది. ఈ రెండు సినిమాల జోనర్స్ వేటికవే విభిన్నమైనవి.

అయితే.. బాలయ్య “రూలర్” కంటే సాయిధరమ్ తేజ్ “ప్రతిరోజూ పండగే” ఆల్మోస్ట్ ప్రతి అంశంలోనూ ఒక రెండడుగులు ముందే ఉంది. పాటల పరంగా కానీ, ట్రైలర్ పరంగా కానీ.. క్రేజ్ పరంగా కానీ “ప్రతిరోజూ పండగ”కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు జనాలు. మరి నందమూరి నటసింహంపై మెగా మేనల్లుడు విడుదల తర్వాత కూడా అప్పర్ హ్యాండ్ ను కొనసాగిస్తాడో లేదో చూడాలి.


వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus