ఈ మెగా హీరోయిన్ మహా నాటు!

సాయిధరమ్ తేజ్ సరసన “తిక్క” సినిమాలో కథానాయికగా నటించిన లారిస్సా బొనేసి గుర్తుంది కదా, అంటే అంత త్వరగా ఎవరికీ గుర్తురాకపోవచ్చు, అందుకు కారణం ఆమె నటించిన సినిమా డిజాస్టర్ గా నిలవడమే కాక పాపకి సినిమాలో పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతోపాటు, అమ్మడి పేరు మన తెలుగు యువకులకి నోరు తిరక్కపోవడం మరో కారణం. స్వతహా మోడల్ అయిన బ్రెజిలియన్ బ్యూటీ లారిస్సా “తిక్క” అనంతరం తెలుగులో వరుసబెట్టి సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకొని మరీ ఇండస్ట్రీకి వచ్చింది. “తిక్క”కు ముందు కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించినప్పటికీ అమ్మడికి అక్కడ అచ్చిరాక తెలుగులో ట్రై చేస్తే ఇక్కడ కూడా సేమ్ రిజల్ట్.

అయితే.. ఒక్క ప్రయత్నంతో ఆగిపోకూడదని భావించిన లారిస్సా ఈసారి స్పీడు పెంచింది. బేసిగ్గా మోడల్ అయిన లారిస్సాకు ఫోజులు ఎలా ఇవ్వాలో ఒకరు చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో.. తానే స్వయంగా ఒక సూపర్ హాట్ ఫోటోషూట్ చేయించుకొంది. సదరు ఫోటోల్లో లారిస్సాను చూసినవాళ్ళందరూ నోరెళ్ళబెట్టడమే కాక ఆమె గురించి ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారట. దాంతో నిన్నటి నుంచి లారిస్సా పేరు గూగుల్ సెర్చ్ లో తెగ కనిపిస్తోంది. మరి లారిస్సా ఆరబోస్తున్న మరిన్ని అందాలను చూసి తరించాలనుకొంటే అర్జెంటుగా ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ను చూసేయండి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus