కళ్యాణ్ దేవ్ సినిమా అన్ని కోట్లు రాబడుతుందా ?

శ్రీజ భ‌ర్త క‌ల్యాణ్ దేవ్ ని మామ మెగాస్టార్ చిరంజీవి తలచుకుంటే భారీ బడ్జెట్ సినిమాతో లాంచ్ చేయొచ్చు. అతని ఫ్యామిలోనే ఒకటి కాదు రెండు కాదు.. మూడు బ్యానర్లు ఉన్నాయి. కానీ సక్సస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి వారాహి చలన చిత్ర బ్యానర్లోనే పరిచయం చేస్తున్నారు. రాకేష్ శ‌శి దర్శకత్వంలో విజేత సినిమా ద్వారా కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ట్రైలర్ తో పరవాలేదనిపించిన అతని నటనను పూర్తిగా చూద్దామని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. జూలై 12 న థియేటర్లోకి రానున్న ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ చిత్రాన్ని మొదట మూడు కోట్లతో పూర్తిచేయాలని అనుకున్నారంట. అయితే సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ వచ్చి జాయిన్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టు బడ్జెట్ డబల్ అయిపోయిందని తెలిసింది.

రిలీజ్ ఖర్చులు, పబ్లిసిటీ కలిపి మరో కోటి ఖర్చు పెట్టినట్లు సమాచారం. మొత్తం మీద బడ్జెట్ ఏడు కోట్లకు చేరింది. అయితే డిస్ట్రిబ్యూటర్ గా సాయి కొర్రపాటికి అనుభవం ఉంది కాబట్టి.. ఎవరికీ అమ్మకుండా సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. నిన్నటిదాకా మెగా హీరో కదా .. ఓపెనింగ్స్ ఉంటాయి.. సులువుగా ఏడుకోట్లు వచ్చేస్తాయని సాయి అనుకున్నారు. కానీ నిన్న తేజు సినిమాకి వచ్చిన కలక్షన్స్ చూసి నిర్మాత షాక్ తిన్నారంట. ఎంత మెగా హీరో అయినా కలక్షన్స్ అంత ఈజీగా రాదని అర్ధయింది. దీంతో విజేత సినిమా బాగాలేకపోతే మెగా స్టార్ అల్లుడైనా ప్రేక్షకులు సింపుల్ గా పక్కన పెట్టేస్తారని నిర్మాతకి భయం పట్టుకుందని టాక్. మరి సాయి ని కళ్యాణ్ గట్టెక్కిస్తాడా ? లేదా ? అనేది కొన్ని రోజుల్లో తేలనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus