సాయి పల్లవి షాకింగ్ డెసిషన్.. కారణం అదే..?

  • May 14, 2020 / 04:31 PM IST

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. మొదటి చిత్రంతోనే నిజంగా ఫిదా చేయించింది. ఈ చిత్రంలో భానుమతి అనే పాత్రలో ఎంతో ఎనర్జిటిక్ గా నటించింది. తరువాత ‘ఎం.సి.ఏ’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకుని తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. అయితే ‘కణం’ ‘పడి పడి లేచె మనసు’ వంటి చిత్రాలు ప్లాప్స్ అయ్యాయి. అయినా ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ఇదిలా ఉంటే.. ‘ఫిదా’ సినిమాలో తన తండ్రిని విడిచి పెట్టి వెళ్లడం ఇష్టం లేక ప్రేమించిన అబ్బాయిని వదిలేసే పాత్రలో ఈమె నటించింది.అయితే ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా అసలు పెళ్ళే చేసుకోను అంటుంది ఈ బ్యూటీ. చదువుకునే రోజుల్లో ఈమె ఓ అబ్బాయిని ప్రేమించినట్టు గతంలో ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. అప్పటి ఫెయిల్ అయ్యింది అని ఇక లైఫ్ లో ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళను అని డిసైడ్ అయ్యిందట.

ఇప్పుడు తన తల్లిదండ్రుల కోసం పెళ్ళే చేసుకోను అని చెబుతుంది ఈ బ్యూటీ. ఇక ఎక్కువ గ్లామర్ షో ఉండే సినిమాలు… కథకు అవసరం లేని పాత్రలు ఎంత ఎక్కువ పారితోషికం ఇచ్చినా చేయనని… డాక్టర్ చదువు పూర్తి చేసి… తల్లిదండ్రులను బాగా చూసుకుంటాను అని ఈ బ్యూటీ చెబుతుంది. క్రేజ్ ఉన్న హీరోయిన్ల పెళ్ళి వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపికే కాబట్టి … ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ అలాగే ‘విరాటపర్వం’ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది సాయి పల్లవి.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus