అభిమానులైతే.. గట్టిగా కోరుకుంటున్నారు జక్కన్న!

  • June 1, 2019 / 07:23 PM IST

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ కు హీరోయిన్ ఇంకా దొరకలేదంట. మొదట ఇందులో తారక్ పాత్రకు జోడీగా హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్ జోనస్ ను ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంది. దీంతో మళ్ళీ వెతుకులాట మొదలు పెట్టాడు జక్కన్న.. తనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న నటి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ఈ వరసలో చాలా మంది హీరోయిన్ల పేర్లు బయటకి వచ్చాయి కానీ ఎవర్నీ ఫైనల్ చేయలేదు. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి అయితే ఎలా బాగుంటుందని, ఆమెనే తీసుకోవాలని.. రాజమౌళి భావిస్తున్నట్టు తాజా సమాచారం. ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలీదు కానీ… ఈ వార్త నిజమైతే బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారట. ఎన్టీఆర్, సాయి పల్లవి ఇద్దరూ మంచి నటులే కాబట్టి వారు ఇలా కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి చివరికి ఏమవుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus