శైలజా రెడ్డి అల్లుడు ఫస్ట్ వీకెండ్ కలక్షన్స్!

  • September 17, 2018 / 11:48 AM IST

విడుదల కావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డప్పటికీ.. వినాయకచవితి సందర్భంగా థియేటర్లోకి వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు కి గణనాథుని అశీసులు బాగానే లభించినట్టు ఉన్నాయి. మారుతీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలక్షన్స్ మాత్రం జోరుగానే వస్తున్నాయి. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ నాటికీ 14.50 కోట్ల షేర్ వసూలు చేసింది. మరో పదికోట్లు రాబట్టగలిగితే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయిపోయినట్లే. ఈ వారాంతానికి శైలజా రెడ్డి అల్లుడు లాభాలను అందించడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఏరియాల వారీగా కలక్షన్స్ కోట్లల్లో ..

ఏరియా : కలక్షన్స్ (షేర్ )
నైజాం : 3.67
సీడెడ్ : 2.09
ఉత్తరాంధ్ర : 1.35
గుంటూరు : 1.13
కృష్ణ : 0.84
ఈస్ట్ గోదావరి :1.30
వెస్ట్ గోదావరి : 0.78
నెల్లూరు : 0.49
ఇతర ప్రాంతాల్లో : 1.63
ఓవర్సీస్ : 1.45
ప్రపంచవ్యాప్తంగా : 14.73

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus