Salman Khan: పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అతను నటించే సినిమాలన్నీ తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అవుతుంటాయి. జనాలు పెద్ద ఎత్తున ఆ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. 56 ఏళ్ళ వయసు వచ్చినా సల్మాన్ ఖాన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. గతంలో ఇతను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. కానీ ముహూర్తానికి కొన్ని గంటల ముందు కావాలని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితులు అలాగే కజిన్స్ అయిన వారు.. ఓపెన్ గానే చెప్పుకొచ్చారు.

సల్మాన్ (Salman Khan) తమ్ముడు అయితే పెళ్లిచేసుకోవడం. తర్వాత విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. అయితే సల్మాన్ ఖాన్ కు పెళ్లి కాకపోయినా అతను చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు అన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా కత్రీనా పేరు వినిపిస్తుంటుంది కానీ.. ఈ లిస్ట్ లో ఆమెతో కలిపి 13 మంది హీరోయిన్లు ఉన్నారు. వారంతా గతంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం నడిపినవారే. ఈ లిస్ట్ లో ఉన్న హీరోయిన్లను ఓ లుక్కేద్దాం రండి :

1) కత్రినా కైఫ్ :

సల్మాన్ ఖాన్ తో ఈమె 4 ఏళ్ళ పాటు సహజీవనం చేసింది. తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి రణబీర్ కపూర్ తో ప్రేమలో పడింది. ఫైనల్ గా విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుని సెటిలైంది.

2) ఐశ్వర్య రాయ్ :

సల్మాన్ తో ఐష్ కూడా డేటింగ్ వ్యవహారం నడిపింది.సల్మాన్ ప్రవర్తన కారణంగా బ్రేకప్ అయినట్టు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాదు సల్మాన్.. ఐశ్వర్య పై దాడి చేసినట్టు కూడా చెప్పుకొచ్చింది. ఫైనల్ గా ఈమె అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుని సెటిలైంది.




3) సోమి అలీ :

ఈ పాకిస్థాన్ నటితో కూడా సల్మాన్ ఖాన్ డేటింగ్ వ్యవహారం నడిపాడు. కానీ కొంతకాలం తర్వాత బ్రేకప్ చెప్పేసుకుని విడిపోయారు. ‘ఈమె కూడా సల్మాన్..నన్ను వేధించాడు’ అంటూ ఆరోపణలు చేసింది.




4) సంగీత బిజ్లానీ :

వీరి మధ్య కూడా ప్రేమ వ్యవహారం నడిచింది. పెళ్లి చేసుకునే వరకు వెళ్లారనే ప్రచారం జరిగింది. 1994 ,మే 27న వీరి పెళ్లి జరిగిపోవాలి. కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. ఆ కారణాలు ఏంటన్నది ఇప్పటికీ తెలీదు.




5) షహీన్ జాఫ్రీ :

సూపర్ స్టార్ అశోక్ కుమార్ మనవరాలు షహీన్ తో కూడా సల్మాన్ ప్రేమాయణం నడిపాడు. చదువుకొనే రోజుల్లో సల్మాన్ ఈమె ప్రేమలో పడ్డాడని.. సల్మాన్ ఖాన్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో వార్తలు వచ్చాయి. షహీన్ .. కియారా అద్వానీ కి అత్త అవుతుంది.




6) స్నేహ ఉల్లాల్ :

స్నేహ ఉల్లాల్ కూడా సల్మాన్ తో డేటింగ్ చేసింది. ఈమెలో ఐశ్వర్య రాయ్ పోలికలు ఉండటం వల్ల అనుకుంట ఈమెతో కనెక్ట్ అయ్యాడు సల్మాన్. కానీ కొంత కాలానికి బ్రేకప్ చెప్పేసుకున్నారు.




7) లులియా :

రోమానియా కు చెందిన లులియా తో కూడా సల్మాన్ ప్రేమాయణం నడిపాడు.




8) క్లాడియా :

జర్మన్ నటి క్లాడియా తో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేశాడు. వీళ్ళు కూడా మనస్పర్థల కారణంగా బ్రేకప్ చెప్పేసుకున్నారు.




9) డైసీ షా :

హిందీ, కన్నడ చిత్రాలతో పాపులర్ అయిన ఈమె కూడా సల్మాన్ తో డేటింగ్ చేసిందని టాక్.




10) మెహెక్ చాహల్ :

ఈ యూరోపియన్ నటి కూడా సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసింది. కొన్నాళ్ళకు ఈమె సల్మాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనడం విశేషం.




11) సోనాక్షి సిన్హా :

శత్రుఘ్న సిన్హా కుమార్తె … సోనాక్షి సిన్హా కూడా ‘దబాంగ్’ టైంలో సల్మాన్ ఖాన్ తో సీరియస్ రిలేషన్ షిప్ ను కొనసాగించింది. వీళ్ళ పెళ్లి వార్తలు కూడా షికారు చేశాయి. కానీ ఫైనల్ గా వీళ్ళు సెపరేట్ అయిపోయారు.




12) హేజెల్ :

బ్రిటన్ కు చెందిన ఈ బ్యూటీ కూడా సల్మాన్ ఖాన్ తో కొంతకాలం సహజీవనం చేసింది. తర్వాత క్రికెటర్ యువరాజ్ సింగ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిందని అప్పట్లో టాక్ నడిచింది. .




13) పూజా హెగ్డే :

సల్మాన్ ఖాన్, పూజ హెగ్డే.. ఏడాది నుండి సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు బి-టౌన్ కోడై కూస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన ‘కిసి క బాయ్ కిసి క జాన్’ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది.




Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus