ట్విట్టర్ లో ఖాన్ భాయ్ కామెడీ!

  • February 6, 2018 / 01:19 PM IST

“ముఝే లడ్కీ మిల్ గయీ” అంటూ ఇవాళ మధ్యాహ్నం సల్మాన్ ఖాన్ చేసి పోస్ట్ చేసిన ట్వీట్ పెద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరికిందేమోననుకొన్నారందరూ. కట్ చేస్తే.. సరిగ్గా గంటన్నర తర్వాత “కంగారుపడకండి నాకు పిల్ల దొరికింది పెళ్లి చేసుకోవడానికి కాదు, నా ప్రొడక్షన్ లో వస్తున్న నెక్స్ట్ సినిమా కోసం” అంటూ ట్వీట్ చేశాడు. దాంతో సల్మాన్ ట్వీట్ వెనుక ఏదో ఉందనుకొని కంగారుపడిన సల్మాన్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థలో ఆయుష్ శర్మను కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించనున్న “లవ్ రాత్రి” చిత్రం కోసం చేసిన హడావుడి ఇదంతా.

హడావుడి బాగానే ఉంది కానీ.. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో తన సినిమాల ఎనౌన్స్ మెంట్/పబ్లిసిటీ కోసం ఈ తరహా ట్వీట్లతో జనాల ఫీలింగ్స్ తో ఆడుకోవడం ఏంటో అని మాత్రం కొందరు కసురుకొంటున్నారు. అయితే.. సల్మాన్ ఖాన్ మాత్రం తన ప్రొడక్షన్ ఫిలిమ్ కి కుదిరినంత పబ్లిసిటీ దొరికిందన్న ఆనందంలో ఉన్నాడు. ఇకపోతే.. సల్మాన్ ప్రస్తుతం “రేస్ 3” షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus