సల్మాన్ ఖాన్-కత్రినాకైఫ్ నడుమ ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టడం మొదలుకొని ఆమె కెరీర్ ను చక్కదిద్దిన ఘనత సల్మాన్ ఖాన్ కే చెందుతుంది. ఈ ఇద్దరి నడుమ మధ్యలో రణబీర్ కపూర్ పుణ్యమా అని గ్యాప్ వచ్చినప్పటికీ.. ఆ టెంపరరీ రిలేషన్ ఎక్కువకాలం నిలవకపోవడంతో కత్రినా మళ్ళీ సల్మాన్ పంచన చేరింది. వాళ్ళిద్దరూ రీసెంట్ గా “టైగర్ జిందా హై” చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అయితే.. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొంటారా లేదా అనే విషయం మాత్రం ఆ దేవుడికే తెలియాలి.
ఇకపోతే.. కత్రినా మీద ఉన్న అభిమానం కమ్ ప్రేమ కమ్ ఆమెతో ఉన్న అవసరం వల్లనో లేక నిజంగానే ఆయనకు అనిపించిందో తెలియదు కానీ.. కత్రినా కైఫ్ చెల్లెలు ఇసాబెల్ కైఫ్ ను కథానాయికగా బాలీవుడ్ కి పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యాడు సల్మాన్ ఖాన్. తనకిష్టుడైన సూరజ్ పంచోళి కథానాయకుడిగా సల్మాన్ నిర్మించనున్న తాజా చిత్రంలో సూరజ్ సరసన కథానాయికగా ఇసాబెల్ ను ఎంపిక చేశాడు. కత్రినా కైఫ్ సోదరిగా ఇప్పటికీ చాలా పాపులర్ అయిన ఇసాబెల్ తన బోయ్ ఫ్రెండ్ తో జరిపిన శృంగారాన్ని వీడియో తీసుకోవడం, ఆ వీడియో ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో నెటిజన్లకి కూడా ఆమె సుపరిచితురాలే. చూస్తుంటే.. అక్కని సెటిల్ చేసినట్లే చెల్లెల్ని కూడా బాలీవుడ్ లో సెటిల్ చేసేలా ఉన్నాడు సల్మాన్ భాయ్.