సల్మాన్ ‘ఛత్రపతి’ అవతారమెత్తుతున్నాడు!

  • July 19, 2016 / 12:30 PM IST

‘సుల్తాన్’ తో సంచలనం రేపిన సల్మాన్ ఖాన్ .. తన కొత్త సినిమా కబురు చెప్పాడు.  ‘ఛత్రపతి శివాజీ’గా వెండితెరపై కనిపించబోతున్నాడు సల్మాన్. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని రితేష్‌ దేశ్‌ముఖ్‌ నిర్మిస్తున్నాడు. నిజానికి ఇది మరాఠి వెర్షన్ లో తెరకెక్కనున్న సినిమా. ఇప్పుడు సల్మాన్, శివాజీ పాత్రకు ఒప్పుకోవడంతో దీని స్కెల్ పెరిగిందనే చెప్పాలి.

ఓ బాలీవుడ్ సినిమాగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు రితీష్. ఇంతకు ముందు రితీష్ మరాఠీలో నిర్మించిన ‘లాయ్‌ భారి’ చిత్రంలో కూడా నటించాడు సల్మాన్‌. రితీష్ వున్న అనుబంధంతోనే ఈ సినిమాని అంగీకరించాడు. రవి జాదవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus