హర్యానాకు చెందిన రెజ్లర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సుల్తాన్’. కండల వీరుడు సల్మాన్ ఖాన్ సుల్తాన్ అలీ ఖాన్ పాత్రలో నటిస్తుండగా.. సల్మాన్ సరసన అనుష్క శర్మ జంటగా నటిస్తోంది. దాదాపు రెండు నెలల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకున్నట్లు చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తెలిపాడు.
’75 రోజుల షూటింగ్ ముగిసింది. మరో 30 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఇప్పుడు చిత్ర షూటింగ్ ప్రారంభమయినట్లు ఉంది. సమయమే తెలియలే’దంటూ తన ట్విట్టర్ అక్కౌంట్ లో పేర్కొన్నాడు జాఫర్. యష్ రాజ్ ఫిల్మ్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా… షారూఖ్ ఖాన్ ‘రాయీస్’ తో బాక్సాఫీస్ వద్ద తలపడనుంది.