Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

సమంత గత కొన్ని రోజులుగా తన గర్భం గురించి, పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుతూనే ఉంది. తల్లి కాబోతున్న నేపథ్యంలో ఆమె మాటలు వింటూ అభిమానులు తెగ ఆనందిస్తున్నారు. ఇప్పుడు ఈ టాపిక్‌ను కాస్త పక్కన పెట్టి తన కెరీర్ గురించి, పెట్టుబడుల గురించి, సినిమాల ఎంపిక గురించి మాట్లాడింది. దీంతో ఆ మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నటిగా, నిర్మాతగానే కాకుండా వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోంది సమంత.

Samantha

ఒకానొక సమయంలో నటనను పూర్తిగా వదిలేయాలని అనుకున్నానని.. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పుల కారణంగానే ఆ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నానని చెప్పింది సమంత. ‘అనారోగ్యం కారణంగా సంవత్సరం విరామం తీసుకున్నప్పుడు ఇతర రంగాలపై దృష్టి పెట్టాలని అనుకున్నాను. ఇకపై ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వీలైతే యాక్టింగ్‌ కాకుండా మరేదైనా వృత్తిని చూసుకోవాలని డాక్టర్లు చెప్పడం వల్ల ఆ ఆలోచన చేశానని చెప్పారు.

దాంతో నాకు నమ్మకం ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాను. వ్యాపారవేత్తగా మారాక జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను అని చెప్పింది సమంత. ఆరోగ్యం బాగాలేనప్పుడు ‘సిటడెల్’ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం ఇబ్బందికరంగా అనిపించింది. నా వల్ల ఆ సినిమాకు ఇబ్బంది కలగకూడదు అనుకుని ఆ ప్రాజెక్ట్‌ చేయలేనని ఈమెయిల్స్‌ పెట్టా. కానీ, వాళ్లు నేనే నటించాలని కోరడంతో ఆ ప్రాజెక్ట్‌ పూర్తి చేశాను. ‘మా ఇంటి బంగారం’ సినిమాకు కూడా మొదట నిర్మాతగానే ఉండాలని అనుకున్నాను.

కానీ రాజ్‌ ప్రోత్సాహం, బలవంతం వల్ల ఆ సినిమాలో నటించాను అని సమంత క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ట్రోల్స్‌ గురించి కూడా సమంత మాట్లాడింది. గతంతో పోలిస్తే ఇప్పుడు అనవసరమైన మాటలను పట్టించుకోవడం మానేశాను. నా గురించి నెగెటివ్‌గా మాట్లాడాలి అని ఇతరులు ఒక నిర్ణయానికి వచ్చేసినప్పుడు వాళ్ల అభిప్రాయాన్ని నేను ఏం చేసినా మార్చలేను. అలాంటప్పుడు వారిని ఒప్పించడానికి నా సమయాన్ని వృథా చేసుకోవడం ఎందుకు అనిపించింది. అదే పని చేశాను.

 పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus