తన ఫ్యామిలీ ఫై సమంత కామెంట్..!!

  • May 18, 2016 / 02:01 PM IST

బ్రహ్మోత్సవం సినిమాలో ఎక్కడెక్కడో స్థిర పడిన పూర్వీకులను వెతికి పట్టుకుని .. అందరూ కలిసి ఉత్సవంలా గడుపుతారు. అలా మీ ఫ్యామిలీ ట్రీ ని వెతికి పట్టుకుంటారా అని బ్రహ్మోత్సవం బ్యూటీ సమంతను ఓ ఇంటర్వ్యూ లో అడిగితే.. “మా పూర్వీకులను కలవడం నాకు ఇష్టమే. కాని వెతకడం కష్టం. ఎందుకంటే మా వాళ్ళను  పట్టుకోవాలంటే ప్రపంచమంతా తిరగాలి.

నేను ఆంగ్లో ఇండియన్. మా గ్రాండ్ మా, గ్రేట్ గ్రాండ్ మాలు  స్కాట్ ల్యాండ్, కెనడాలలో స్థిర పడ్డారు. వారితో పాటు మా బంధువులను వెతికేందుకు చాలా శ్రమ పడాలి.” అని చెప్పారు. సమంత సూపర్ స్టార్ మహేష్ తో కలిసి నటించిన బ్రహ్మోత్సవం సినిమా 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus