తమ ప్రేమ కథ ఎప్పుడు మొదలయిందో చెప్పిన సమంత

  • August 12, 2017 / 06:34 AM IST

ప్రేమకథ చదివేందుకు, చూసేందుకు మాత్రమే కాదు వినడానికి కూడా బాగుంటుంది. ఆ లవ్ స్టోరీ మనం అభిమానించే వ్యక్తులది అయితే… మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఈ ఏడాదిలో అందరికీ తెలిసిన నాగచైతన్య, సమంతల లవ్ స్టోరీ ఇన్ని నెలలు గడుస్తున్నా వారి ప్రేమ కథను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. వీరిద్దరిలో ఎవరు కనిపించినా ప్రేమ, పెళ్లి గురించి ప్రశ్న తప్పకుండా అడగాల్సిందే. రీసెంట్ గా ఓ జాతీయ మీడియా సమంతను “నాగచైతన్య పై అసలు మీకు ప్రేమ ఎప్పుడు పుట్టింది?” అని అడిగింది.

అందుకు ఆమె సమాధానమిస్తూ .. ఏ మాయ చేసావే చిత్రం సమయంలో తొలిసారి చైతూని చూసినప్పుడే అతని ప్రేమలో పడిపోయానని వివరించింది. అప్పుడు మొదలైన ప్రేమ స్టోరీ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతోంది. అక్టోబర్ 6 వ తేదీన గోవాలో వీరిద్దరూ పెద్దల ఆశీర్వాదంతో భార్య భర్తలు కానున్నారు. అప్పటి లోపున తమ చేతుల్లోని ప్రాజక్ట్ లను కంప్లీట్ చేసే పనిలో సమంత, నాగచైతన్య ఉన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus