సావిత్రి జీవితంలా నా జీవితం కూడా నాశనం అయిపోయేది

  • June 4, 2018 / 01:07 PM IST

మొదటి సినిమా అయిన “ఏం మాయ చేసావే” షూటింగ్ అప్పట్నుంచే తాను నాగచైతన్యతో ప్రేమలో ఉన్నానని సమంత చెపుకొస్తున్నప్పటికీ.. “జబర్దస్త్” సినిమా టైమ్ లో సిద్ధూ-సామ్ సహజీవనం చేశారనేది జగమెరిగిన సత్యం. అయితే.. అక్కినేని వారి కోడలయ్యాక ఆ పాత రొచ్చును టచ్ చేసే ధైర్యం ఎవరికీ సరిపోలేదు. అయితే.. పెళ్ళైన తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రీవీయస్ లవ్ & ఎఫైర్స్ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ.. “నేను కూడా సావిత్రి గారిలాగే కెరీర్ తొలినాళ్లలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నాను. అయితే.. వెంటనే రియలైజ్ అయ్యి వాటిని ఎవాయిడ్ చేయగలిగాను. ఆ తర్వాత నా జీవితంలోకి నాగచైతన్య వచ్చాడు” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక్కడ డైరెక్ట్ గా సిద్ధార్డ్ ని ఏమీ అనకపోయినా.. ఇండైరెక్ట్ గా అతడ్ని జెమిని గణేషన్ తో పోల్చడం అనేది కొత్త వివాదానికి దారి తీసింది. సమంత తనకు బ్రేకప్ చెప్పినప్పట్నుంచి సిద్ధార్ధ్ ఒక్కటంటే ఒక్కసారి కూడా ఆమె గురించి తప్పుగా మాట్లాడడం అనేది చేయలేదు. కానీ.. సమంత ఇప్పుడు పబ్లిక్ గా సిద్ధూపై కామెంట్ చేయడం పట్ల అతడు ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus