బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ ఒకరికోసం ఒకరు త్యాగాలు చేస్కోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. సీజన్ 1 నుంచి కూడా ఆనవాయితీగా ఇది వస్తూనే ఉంటుంది. కాకరకాయరసం తాగడం, పేడలో పడుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం ఇలా ఒకరిని కాపాడేందుకు ఒకరు త్యాగం చేస్తుంటారు. ఇక్కడ గమ్మత్తేంటంటే.., హౌస్ మేట్స్ ని ఒకరిని ఒకరు నామినేట్ చేస్కుంటారు. అలాగే నామినేషన్స్ నుంచి కాపాడుకునేందుకు త్యాగాలు చేస్తుంటారు. ఇక ఇప్పుడు సీజన్ 4 లో అమ్మరాజశేఖర్ మాస్టర్ అయితే కెప్టెన్సీ రేస్ కోసం సగం గుండు, సగం షేవింగ్ చేయించుకోవడానికి సిద్ధపడ్డారు.
ఆతర్వాత మనసు మార్చుకున్నారు. కానీ నాగార్జున నామినేషన్స్ నుంచి సేఫ్ అవుతారు రెడీనా అనేసరికి హాఫ్ గుండు – షేవ్ చేస్కుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే, ఈవారం దసరా పండగకాబట్టి చాలామంది ఎలిమినేషన్ జరగదు అనుకున్నారు. కానీ, హోస్ట్ గా వచ్చిన సమంత దివిని ఎలిమినేట్ చేసింది. దీంతో అమ్మ రాజశేఖర్ చేయించుకున్న గుండుకి న్యాయం చేసింది. ఒకవేళ ఎలిమినేషన్ లేకపోతే మాత్రం అమ్మరాజశేఖర్ గుండు చేయించుకుని వేస్ట్ అయ్యి ఉండేది.
నిజానికి రాజశేఖర్ మాస్టర్ కి నామినేషన్స్ అంటే కాస్త టెన్షనే. అంతేకాదు, తనని నామినేట్ చేసినవారిని శత్రువుల్లా కూడా చూస్తారు. కానీ మళ్లీ వారితోనే కలిసి టాస్క్ ఆడతారు. అందుకే హాఫ్ గుండు చేయించుకుంటే మీరు ఎవరినన్నా కూడా సేఫ్ చేయచ్చు అంటే.. నాకు నేనే సేఫ్ అవుతాను అన్నారు. ఆవారం ఇమ్యూనిటీని పొందారు. బహుశా దివి ఎలిమినేట్ అయిపోతుంది అని తెలిస్తే ఖచ్చితంగా ఆ గుండుని దివికోసం త్యాగం చేసి ఉండేవారే. పాపం ఏం చేస్తాం.. నచ్చిన హైయిర్ పోయింది. తనని అభిమానించే పార్టిసిపెంట్ వెళ్లిపోయింది. ఈ వీక్ మాస్టర్ టైమ్ అస్సలు బాలేదు. మరి నెక్ట్స్ వీక్ ఎలా ఉంటుందో చూడాలి.
Most Recommended Video
కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!