రాధారవికి సమంత స్ట్రాంగ్ కౌంటర్..!

  • March 26, 2019 / 01:35 PM IST

సౌత్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార పై సీనియర్ నటుడు రాధారవి ఇటీవల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ మొత్తం రాధారవి పై మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా రాధారవి మాత్రం ‘కావాలంటే నయన తారని మా ఇంటికి రమ్మనండి క్షమాపణలు చెబుతాను.. అంతేగాని నేను ఎక్కడికి పడితే అక్కడి వచ్చి క్షమాపణలు చెప్పను’ అంటూ ఇంకా వివాదాన్ని పెంచే కామెంట్స్ చేస్తున్నాడు.

ఈ విషయం పై నయనతార కూడా రాధారవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే మన అక్కినేని కోడలు సమంత కూడా రాధారవి పై గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘ సమంత ఈ విషయం పై స్పందిస్తూ ”మిస్టర్ రాధారవి.. కష్టమనేది ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. మీరు చాలా భాదల్లో ఉన్న వ్యక్తి. అందుకు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది. మీకు మానసిక ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాం. నయనతార తర్వాతి సూపర్ హిట్ సినిమా టికెట్లు మీకు కొనిస్తాం. పాప్ కార్న్ తింటూ ఆశ్వాదించండి” అంటూ తన ట్విట్టర్లో పేర్కొంది సమంత. సమంత ట్వీట్ పై నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో పక్క రాధారవి ను తన పార్టీ నుండి సస్పెండ్ చేశారు కూడా. అంతే కాదా.. ఇక పై రాధా రవిని సినిమాల్లో తీసుకోమని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రకటించడం సంచలనంగా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus