రైల్వే క్లర్క్‌గా సమంత నటించనుందా?

  • November 21, 2018 / 11:27 AM IST

హీరోయిన్ సమంత ఇటీవలే వచ్చిన ‘యూటర్న్’ సినిమాతో అందరిని అలరించింది. ఇక పెళ్లి తరువాత సమంత, హీరో నాగ చైతన్య ఇద్దరు కలసి ఒక సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు ‘నిన్నుకోరి’ ఫెమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో మరో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్‌ నటిస్తుంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాని సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు.నాగ చైతన్య, సమంత కలసి నటిస్తున్న ఈ సినిమాకి ‘మజిలీ’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పెళ్లి తరువాత భార్య, భర్తల మధ్య ఉండే చిలిపి గొడవలు, వాళ్ళ మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం సింహాచలం రైల్వేస్టేషన్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమాలో సమంత రైల్వే క్లర్క్ పాత్రలో నటిస్తునట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబందించిన సెట్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాయి. ఇక నాగ చైతన్య, సమంత పెళ్లి తరువాత మొదటి సారిగా కలసి నటిస్తుండం, వీరి కాంబినేషన్ లో ఈ సినిమా నాలుగోది కావడంతో సినిమాపైనే అంచనాలు భారీగానే ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus