హీరోయిన్లు హ్యాండ్ ఇచ్చారు!

  • June 30, 2016 / 09:49 AM IST

హీరోయిన్లు సినిమాల్లో కంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగులు, ప్రైవేట్ ఫంక్షన్లకు గెస్ట్ లుగా వచ్చి సంపాదించేదే ఎక్కువ. అందుకే మన హీరోయిన్లందరూ ఎప్పుడు కుదిరితే అప్పుడు విదేశాలకు పారిపోతారు. అక్కడ వాళ్ళకి దొరికే గౌరవ మర్యాదలు ఇంకెక్కడా కనీసం చూసి ఉండరు వాళ్ళు.

ప్రస్తుతం కాలిఫోర్నియాలో జరుగుతున్న “ATA” ఉత్సవాలకు హాజరవ్వాల్సిన సమంత, తమన్నాలు అక్కడికి వెళ్లకుండా హ్యాండ్ ఇచ్చారని తెలుస్తోంది. అడ్వాన్స్ పేమెంట్ కూడా తీసేసుకోని ఆఖరి నిమిషంలో “సారీ మాకు కుదరడం లేదు” అని ట్వీట్ చేసి ఊరుకొన్నారిద్దరూ.

అక్కడేమో ఈ ఇద్దరు హీరోయిన్ల ఫోటోలు చూపించి భారీ ధరలకు ఈవెంట్ పాస్ లు అమ్ముకొన్న నిర్వాహకులు ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో తోచక జుట్టు పీక్కొమ్టూన్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus