నాగచైతన్య, త్రివిక్రమ్ ల స్నేహం వెనుక సమంత

  • March 10, 2017 / 10:58 AM IST

కింగ్ అక్కినేని నాగార్జునకు దొరకని అవకాశం ఆయన తనయుడు నాగ్ చైతన్యకు దక్కిందా ? త్రివిక్రమ్ శ్రీనివాస్, చైతూ కాంబినేషన్లో సినిమా రానుందా ?.. అంటే.. అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ తో మూడో సినిమాని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. దీని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు. కానీ పవన్ మూవీ మొదలు కావడం లేట్ అవ్వడంతో దాని ప్రభావం  తర్వాతి సినిమాపై పడింది. ఎన్టీఆర్ డేట్స్ వృధా అవుతోంది. అందుకే అతను త్రివిక్రమ్ ప్రాజక్ట్ ని వదులుకున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ స్థానంలో నాగ చైతన్య వచ్చి చేరారు. చైతూని సమంత నే త్రివిక్రమ్ కి పరిచయం చేసింది. స్యామ్, మాటల మాంత్రికుడి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే త్రివిక్రమ్ వరుసగా ‘అత్తారింటికి దారేది’, సన్నాఫ్ సత్య మూర్తి, ‘అ ఆ’ సినిమాలలో ఆమె ను తీసుకున్నారు. ఈ స్నేహంతోనే చైతూతో సినిమా చేయమని డైరక్టర్ ని కోరినట్లై అందుకు ఆయన ఒకే చెప్పినట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉంన్నారని టాక్.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus