సమంత బెస్ట్ రోల్స్

  • April 27, 2017 / 02:36 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అతి తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ సమంత. అమాయకత్వం నిండిన కళ్లు, స్వచ్ఛమైన చిరునవ్వుతో తెలుగు ప్రేక్షకుల అభిమాన తారగా మారిపోయారు. తనకి సూటయ్యే పాత్రలు ఎంపిక చేసుకోవడం, ఆ పాత్రకు తగిన న్యాయం చేయడం .. ఈ రెండు సూత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో సమంత చేరిపోయారు. ఆమె నేడు (ఏప్రిల్ 28 ) పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి ఫిల్మ్ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. క్యూట్ బ్యూటీ పోషించిన క్యారెక్టర్లలో గుర్తిపు పొందిన వాటిపై ఫోకస్….

జెస్సీ సమంత ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో జెస్సీగా చాలా క్యూట్ నటించి క్యూట్ బ్యూటీ అనే పేరుని సొంతం చేసుకున్నారు. అందరిని తన నటన మాయలో పడేసి హిట్ అందుకున్నారు.

ఇందు నేటి కాలేజీ అమ్మాయిగా బృందావనం సినిమాలో సమంత నటించింది. మొదట్లో సరదాగే ఉండే ఈ పాత్ర చివరికి గుండెనిండా బరువు నింపుకుంటుంది. ఇలా రెండు షేడ్స్ లో చక్కగా నటించి ఇందుని అందరి హృదయాల్లో నిలిపింది.

ప్రశాంతి మహేష్ బాబు పక్కన సమంత అనగానే సూట్ అవుతుందా? అని అందరూ అనుకున్నారు. కానీ దూకుడు సినిమాలో ప్రశాంతిగా ప్రిన్స్ కి పెర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది. ప్రతిసారీ మహేష్ కి ఇరుక్కుపోతూ వినోదాన్ని పంచింది.

బిందు సమంతలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించిన మూవీ ఈగ. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో స్యామ్ బిందు రోల్ పోషించింది. ఎప్పుడూ చిలిపిగా కవ్వించే సమంత ఈ చిత్రంలో ప్రతీకారం తీర్చుకునే అమ్మాయిగా నటించి మెప్పించింది.

గీత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ పక్కన సమంత రెండో సారి నటించింది. ఇందులో మహేష్ వెంట పడే అమ్మాయి గీతగా ఆకట్టుకుంది. “నేను బుంగమూతి పెట్టాను” అంటూ పక్కింటి అమ్మాయిలా కనిపించి మార్కులు కొట్టేసింది.

శశిగొప్పింటి అమ్మాయి. కొంచెం గర్వం. కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రేమించానని చెప్పడానికి ఈగో అడ్డు వస్తుంది. ఇలాంటి లక్షణాలున్న శశిగా అత్తారింటికి దారేదిలో సమంత నటించింది. ఆ పాత్రకు సమంత తప్ప ఎవరూ సూటవ్వరానంతగా నటించి విజయం సొంతం చేసుకుంది.

కృష్ణవేణి, ప్రియసమంత డ్యూయల్ రోల్ పోషించిన సినిమా మనం. ఆనాటి గృహిణి కృష్ణవేణిగా, నేటి అమ్మాయి ప్రియగా బ్యాలెన్సింగ్ నటనతో ఔరా నిపించింది. నాగార్జునకు అమ్మగా కనిపించే సన్నివేశాల్లో సమంత ఎక్స్ ప్రెషన్స్ అందరికి గుర్తిండిపోయాయి.

సమీరా టాప్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సమయంలో రోగిగా ఎవరైనా నటిస్తారా? నటిస్తారు.. నటించారు ఆమె సమంత. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో షుగర్ వ్యాధితో బాధపడే సమీరాగా సమంత చక్కని నటనని ప్రదర్శించారు.

అనసూయ సినిమాలో హీరో పక్కన స్క్రీన్ పంచుకోవడానికి పరిమితమయిన సమంత అ… ఆ మూవీ టైటిల్ ని పంచుకుంది. అనసూయగా సినిమా బాధ్యతను కూడా భుజాన వేసుకొని విజయ తీరానికి తీసుకెళ్లింది. మరో మారు సంపన్నరాలిగా నటించి సక్సస్ అందుకుంది.

ధన(బుజ్జి)
ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమా జనతా గ్యారేజ్ లో సమంత సహజనటనతో ఆకట్టుకుంది. ధన(బుజ్జి) క్యారక్టర్ లో సమంత హీరోని అమితంగా ప్రేమిస్తుంది. ఇక పెళ్లి తథ్యం అనుకుంటుంది. కానీ విడిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో సమంత నటన ప్రేక్షకుల కంట కన్నీరుని తెప్పిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus