Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో బేబీ బంప్‌తో కనిపించి తన ప్రెగ్నెన్సీ గురించి చిన్న హింట్‌ ఇచ్చిన సమంత.. ఇప్పుడు తాను గర్భవతిని అని క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ నిన్న రాత్రి నిర్వహించారు. ఆ వేదిక మీద ఆమె మాట్లాడుతున్నప్పుడు తన ప్రెగ్నెన్సీ గురించి ప్రేక్షకుల దగ్గర నుండి ప్రస్తావన వచ్చింది. దానికి ఆమె రియాక్ట్‌ అవుతూ తన ప్రెగ్నెన్సీ రూమర్‌ కాదు, నిజమే అని చెప్పకనే చెప్పింది.

Samantha

‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదలయ్యాక ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఆఫీసు దగ్గర జరిగిన సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో సమంతను చూసిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది. జీన్స్, టీ షర్టులో వచ్చిన సమంత బేబీ బంప్‌ కనిపించింది. దానికి తోడు ఆమెను కేక్ కట్ చేయమని కత్తి ఇవ్వబోతే ‘నేను కత్తి పెట్టుకోకూడదు’ అని సమంత చెప్పడంతో ఆమె గర్భవతి అని తేలిపోయింది. తాజాగా ఇప్పుడు ‘నేను మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నా’ అని చెప్పేసి అఫీషియల్‌గా చెప్పింది.

సమంత గతేడాది డిసెంబరులో దర్శకనిర్మాత రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. ఆ తర్వాత చేసిన సినిమా ‘మా ఇంటి బంగారం’ రూ.50 కోట్ల క్లబ్బులో చేరింది. దీంతో గత కొన్ని నెలలుగా ఆమెకు అంతా మంచే జరుగుతోంది అంటూ ఆమె ఫ్యాన్స్‌ సంతోషపడుతున్నారు. ఇక తన సినిమా గురించి సమంత మాట్లాడుతూ రిస్క్‌ తీసుకోకపోతే, ఒక సర్కిల్‌లో పరిమితం అయిపోతాం. ఇలాంటి పాత్ర చేయడం నిజంగా ఛాలెంజ్‌. ఈ విషయంలో టీమ్‌ సహకరించింది అని చెప్పుకొచ్చింది. చిరంజీవి ప్రశంసించడం మాకు పెద్ద ప్రోత్సాహం. మా టీమ్‌తో గంటకుపైగా మాట్లాడారు అని చెప్పింది.

ఈ క్రమంలోనే రిలేషన్‌ షిప్‌ గురించి కూడా మాట్లాడింది సామ్‌. కొన్ని రిలేషన్‌షిప్‌లు సంక్లిష్టంగా ఉంటాయి. అవి మన చేతుల్లో ఉండవు. ఇద్దరి చేతుల్లోనూ ఉంటాయి. ఒక మహిళకు తనపై తనకు నమ్మకం ఉండాలి. అప్పుడే సరైన వ్యక్తిని గుర్తించగలదు. లేకపోతే, తప్పులు జరుగుతాయి. రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్లకు నేను సలహా ఇస్తున్నా. ఎదుటి వ్యక్తి మీకు సంపూర్ణత్వం తీసుకురావాలని చూడకండి. మొదట మిమ్మల్ని మీరు పరిపూర్ణ వ్యక్తిగా మార్చుకోండి అని చెప్పింది.

మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus