అలనాటి నటిలా సమంత!!

Advertisement

అమాయికత్వంతో అందంగా కనిపించే తార సమంత. ఆమె ఆనందానికి హద్దు ల్లేకుండా పోయింది. కారణం ఏమిటంటే ఆమె నటించిన తేరి, 24 సినిమాలు ఈ సమ్మర్ లో రిలీజ్ అయి, హిట్ కొట్టాయి. అంతే కాదు ఆమె నటించిన బ్రహ్మోస్తవం సినిమా వచ్చే వారంలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచారాన్ని ఆమె ప్రారంభించింది. శుక్రవారం చీరకట్టులో అల నాటి హీరోయిన్లను గుర్తుకు తెచ్చింది.

ట్విట్టర్ లో కొత్త రికార్డ్
సమంత ట్విట్టర్ లో కొత్త రికార్డ్ సృష్టించింది. ఆమె గురువారం ట్విట్టర్ లో అభిమానులతో చాట్ చేసింది. ఇందుకు విశేషంగా స్పందన వచ్చింది. చాట్ మొదలైన గంటలోనే 19 వేల ట్వీట్స్ పోస్ట్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో ఆమె అంటే ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు చిలిపిగా సమాధానాలు చెప్పింది.

*మిమ్మల్ని అత్యంత భయపెట్టే అంశం ఏది ?
నేను ఎక్కడ నుంచి మొదలయ్యానో అక్కడికి వెళ్లి పోతానేమోనని భయం.

*మీరు సమంత గా ఉండడం వల్ల మీకు ఉపయోగ పడే అంశం ఏది?
నన్ను ప్రేమించే పెద్ద ఫాన్స్ ఆర్మీ ఉండడం.

*మీ అందానికి రహస్యాలు ఏమిటి?
నైట్ క్రీం, విటమిన్స్, సన్ స్క్రీం .

*చిన్మయి కాకుండా మీకు ఎవరి వాయిస్ సూట్ అవుతుంది?
నా వాయిస్.

*విజయ రహస్యం ఏంటి?
విజయానికి రహస్యం హార్డ్ వర్క్.

*మీరు మహేష్ బాబు కూతురు సితార తో ఏమి మాట్లాడారు ?
ఆమె నైల్ పాలిష్ గురించి.

*మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు మరిచిపోకుండా వెంట తీసుకుని వెళ్ళేవి ఏంటి?
సన్ స్క్రీం, మందులు, మంచి అండర్ వేర్.

ఇలా గురువారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus