ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా సమంత డ్రెస్ ధర!

  • August 7, 2020 / 09:53 PM IST

రానా- మిహిక బజాజ్ మెహిందీ ఫంక్షన్ నిన్న ఘనంగా జరుగగా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు హాజరుకావడం జరిగింది. రానా బంధువు అయిన నాగ చైతన్య భార్య సమంతతో కలిసి వేడుకకు హాజరయ్యారు. ఐతే ఈ మెహింది వేడుకలో సమంత స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ముఖ్యంగా ఈ వేడుకకు వచ్చిన బంధువుల కళ్లన్నీ సమంత డ్రెస్ పైనే పడ్డాయి. పెళ్ళిలో ఫోటోగ్రాఫర్స్ కెమెరాలన్నీ ఆమె వైపు మళ్ళాయి. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఎల్లో మోటో బుట్టి డ్రెస్ ధరించిన సమంత అద్భుతంగా దర్శనం ఇచ్చింది.

షెల్ డిటైలింగ్ కలిగిన ఆ డ్రెస్ సమంత అందాన్ని మరింత పెంచింది. వేడుక మొత్తం సమంత డ్రెస్ పైనే చర్చ నడిచిందంటే ఆ డ్రెస్ ప్రత్యేకత ఏమిటో అర్థం అవుతుంది. ఇంత మందిని ఆకర్షించిన ఆ డ్రెస్ ధర కూడా మరో విశేషమే. సమంత ఈ వేడుక కోసం అక్షరాలా 1.59 లక్షల రూపాయలు పెట్టి ఆ డ్రెస్ కొన్నారట. మరి ఒక్క డ్రెస్ కోసం అంత మొత్తం అంటే మాములు విషయం కాదు. సినిమాకు కోటి రూపాయలకు పైగా తీసుకొనే సమంత అంత పెద్ద వేడుకకు ఆమాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా.

ప్రముఖుల పెళ్లి వేడుకలో వేసుకున్న డ్రెస్ లు నగలే కదా వారి కీర్తిని పెంచేది. దీనిని బట్టి అక్కినేని వారి కోడలు వారి స్టేటస్ కి ఏమాత్రం తగ్గకుండా మైంటైన్ చేస్తుందనిపిస్తుంది. మరి మెహింది వేడుకే లక్షన్నర వెచ్చించి డ్రెస్ కొనుగోలు చేసిన సమంత రేపు జరగనున్న పెళ్లి వేడుకకు ఎన్ని లక్షల విలువ చేసే డ్రెస్ కొనుగోలు చేయనుందో చూడాలి. ఇక సమంత టాలీవుడ్ లో సినిమాలు పెద్దగా ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత, ఓ తమిళ చిత్రంలో నటించనున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus