ఏదేమైనా సమంత భలే పంచ్ ఇచ్చిందిగా..?

చైతన్యతో వివాహం జరిగిన తరువాత సామ్ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే పెళ్ళైన తరువాత కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. దీంతో వరుస విజయాలు ఆమెను వరించాయి. తెలుగుతో పాటూ తమిళ్ లో కూడా ఆమె అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘అభిమన్యుడు’ ‘మజిలీ’ ‘సూపర్ డీలక్స్’ ఇలా వరుస విజయాలు ఆమెను వరించాయి. ఇదిలా ఉండగా ఆమె ‘ఓ బేబీ’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తుంది.

ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియాలో ఆమె పేరు ‘బేబీ అక్కినేని’ గా మార్చుకుంది. ఇది కేవలం సినిమా ప్రమోషన్ కోసం ఇలా మార్చుకుంది అని కొందరు కాజువల్ గా తీసుకుని వదిలేసినా.. మరికొందరు మాత్రం సమంత గర్భవతి అయ్యిందని అందుకే ఇలా పెరుమార్చుకుందని కథనాలు రాసుకోచ్చేసారు. దీంతో వెంటనే సమంత ఆ వెబ్ సైట్ లింక్ ని తన ట్విట్టర్ లో షేర్ చేసి ‘నిజంగా తాను తల్లి అవుతోందా..? ఒకవేళ అది నిజమైతే నాకు కూడా చెప్పమంటూ” సెటైర్ వేసింది. అంటే తనకి గర్భం వస్తే తనకు తెలియకుండా మిగిలినవాళ్ళకు ఎలా తెలుస్తుంది అన్నది ఆమె ఉద్దేశం. ఇలా తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ప్రెగ్నన్సీ అంటే కాస్త రిస్క్ అనే చెప్పాలి. సో ఈ టైములో చైసామ్ కు అలాంటి ఆలోచనలు లేకపోవచ్చు కూడా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus