అలనాటి మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి తొలి తరం హీరోలతో సమానంగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె జీవితంలో అందరికి తెలిసిన సంగతులు కాకుండా, తెలియని కోణాన్ని వెండి తెరపై చూపించడానికి యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కొంత కాలంగా శ్రమిస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను తీసిన ఈ డైరక్టర్ గత ఏడాది అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ ని పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సావిత్రి కథను ఆకట్టుకునేలా చెప్పడానికి మంచి హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.
నాగ్ అశ్విన్ కష్టం చూసి మామ అశ్వినీదత్ బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని కొంతకాలం క్రితం సంప్రదించారు. ఆమె 4 కోట్లు డిమాండ్ చేయడంతో టాటా చెప్పి వచ్చేసారు. తర్వాత నిత్యామీనన్ ని అనుకున్నారు. ప్రస్తుతం ఈ పాత్ర టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత కు వెళ్లిందని సమాచారం. వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్లో నిర్మించనున్న మూవీకి సమంత కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం స్యామ్ ట్విట్టర్లో “గొప్ప ప్రాజక్ట్ కి సైన్ చేసాను.. ఆ వివరాలు త్వరలో చెబుతాను” అని పోస్ట్ పెట్టింది ఈ చిత్రం గురించేనని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. మరి మహానటి బయోపిక్ లో ఈ బ్యూటీ ఎంత మేర మెప్పిస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.