సినిమా విడుదలకు సరిగ్గా రెండ్రోజులుంది. విడుదల తేదీ ప్రకటించింది కూడా కేవలం వారం ముందు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాల విడుదల తేదీలను కనీసం నెల ముందు ప్రకటించి పబ్లిసిటీ పనులు మొదలెడతారు. కానీ.. “వెంకీ మామ” విషయంలో అంతా హరీబారీగా జరిగిపోయింది. అందుకే.. సినిమా ప్రమోషన్స్ కోసం సురేశ్ బాబు, రాణా కూడా స్వయంగా రంగంలోకి దిగి వీలైనంతగా సినిమాను జనాలకు చేరువ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు.
వెంకటేష్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్, సురేశ్ బాబు, రాణాలతోపాటు ఇప్పుడు సమంత కూడా రంగంలోకి దిగుతోంది. రీసెంట్ గా సమంత తన భర్త నాగచైతన్య మరియు వెంకీ మామ టీం ను ఇంటర్వ్యూ చేసింది. “మజిలీ” సినిమా ప్రమోషన్స్ టైమ్ లో కూడా నాగచైతన్య-సమంతల ఇంటర్వ్యూలు సినిమాకి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. అందుకే “వెంకీ మామ”కు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.
24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!